ఏనుగు దాడిలో ఆర్మీ జవాన్‌‌‌‌ మృతి

ఏనుగు దాడిలో ఆర్మీ జవాన్‌‌‌‌ మృతి
  • మృతుడు భద్రాచలం పట్టణానికి చెందిన సాయిచంద్రరావు
  • అసోం రాష్ట్రంలో ఘటనభద్రాచలం, 

వెలుగు : ఏనుగు దాడిలో భద్రాచలం పట్టణానికి చెందిన ఓ ఆర్మీ జవాన్‌‌‌‌ చనిపోయాడు. ఈ ఘటన అసోం రాష్ట్రంలో ఆదివారం జరిగింది. భద్రాచలం పట్టణానికి చెందిన కొంగా సాయిచంద్రరావు పదేండ్లుగా ఇండియన్‌‌‌‌ ఆర్మీలో నాయబ్‌‌‌‌ సుబేదార్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అసోం రాష్ట్రంలో డ్యూటీ చేస్తున్న సాయిచంద్రరావు ఆదివారం నామ్‌‌‌‌గావ్‌‌‌‌ టీఎస్టేట్‌‌‌‌ రెండో ఆర్మీ కంటోన్మెంట్‌‌‌‌ నుంచి ఠాకూర్‌‌‌‌ బారీ, రంగపర సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. 

ఈ టైంలో ఒక్కసారిగా ఏనుగుల గుంపు దాడి చేసింది. వాటి నుంచి తప్పించుకునేందుకు జవాన్లు పారిపోతుండగా సాయిచంద్రరావు కింద పడిపోయారు. దీంతో ఓ ఏనుగు అతడిని తొక్కి చంపేసింది. ఆర్మీ అధికారులు భద్రాచలంలోని సాయిచంద్రరావు కుటుంబానికి సమాచారం ఇచ్చారు. సాయిచంద్రరావు మృతదేహాన్ని భద్రాచలం తీసుకొస్తున్నారు.