భద్రాచలం, వెలుగు: అసోంలో ఏనుగు దాడిలో చనిపోయిన ఆర్మీ నాయబ్ సుబేదార్ కొంగా సాయిచంద్రరావు అంత్యక్రియలు మంగళవారం సొంతూరు భద్రాచలం టౌన్ లో ముగిశాయి. డెడ్ బాడీని ప్రత్యేక ఫ్లైట్ లో హైదరాబాద్ కు, అక్కడి నుంచి భద్రాచలం తీసుకొచ్చారు. సాయంత్రం అంతిమయాత్ర నిర్వహించగా ఆర్మీ జవాన్లు పాల్గొని నివాళులర్పించారు. అసోం నుంచి వచ్చిన ఆర్మీ జవాన్రెహ్మాన్ జాతీయ జెండాను సాయిచంద్రరావు భార్యకు అందజేయగా ఆమె గుండెకు హత్తుకుని బోరున విలపించగా పలువురు కంటతడి పెట్టారు. పదేండ్లుగా ఆర్మీలో నాయబ్ సుబేదార్ గా విధులు నిర్వహిస్తున్న సాయిచంద్రరావు గత ఆదివారం అసోంలో ఏనుగుల గుంపు దాడి చేయగా మృతిచెందిన విషయం తెలిసిందే.