దేశరక్షణలో భాగంగా.. అనారోగ్యంతో ఆర్మీ జవాన్ మృతి

నల్లగొండ జిల్లా : దేశరక్షణలో భాగమైన ఆర్మీ జవాన్ జూలై 25న అనారోగ్యంతో చికిత్స తీసుకుంటు మృతి చెందాడు. నల్గొండ జిల్లా అనుముల మండలం మదారిగూడెం గ్రామానికి చెందిన ఈరటి మహేష్(24)  అస్సాం రాష్ట్రంలో 20 నెలలుగా జనరల్ డ్యూటీలో గన్నర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. జులై 9 న జ్వరం మహేష్ కు జ్వరం వచ్చింది. డిబ్రూఘర్‌ జిల్లా మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్నా ప్రభుత్వ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. 

అకస్మాత్తుగా కడుపు నొప్పి రావడంతో ICUకు తరలించారు. పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు అధికారులు. చికిత్స పొందుతూ జులై 25  సాయంత్రం 7గంటలకు ఆర్మీ జవాన్  ఈరటి మహేష్ మృతి చెందాడు. శుక్రవారం(ఈరోజు) హెలికాప్టర్ లో అస్సాం నుండి  హైదరాబాద్ కు.. సాయంత్రం సొంత గ్రామానికి మహేష్ మృతదేహం చేరుకుంటుంది.