ఆర్మీ జవాన్ల సాయానికి రైతులు హ్యాట్సాప్

ఆర్మీ జవాన్ల సాయానికి రైతులు హ్యాట్సాప్

హాలియా, వెలుగు: అకాల వర్షానికి వడ్లు తడుస్తుండగా  రైతులకు ఆర్మీ జవాన్లు సాయం చేశారు.   నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధి ఇబ్రహీంపేట స్టేజీ వద్ద ప్రధాన రోడ్డు వెంట రైతులు వడ్లను ఎండబెట్టారు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా  అకాల వర్షం పడింది. దీంతో వడ్లపై కప్పిన పట్టాలు గాలికి లేచిపోయాయి. అదే సమయంలో అట్నుంచి ఆర్మీ జవాన్లు వెళ్తుండగా వడ్లు తడుస్తుండడం చూశారు.

వెంటనే దిగి అక్కడున్న పట్టాలను కప్పి వడ్లను తడవకుండా చేశారు. దీంతో జవాన్లకు రైతులు చేతులెత్తి దండం పెట్టి హ్యాట్సాప్ చెప్పారు.  దేశ సేవ చేయడమే కాదు.. రైతుల బాధలు తీర్చారంటూ స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేశారు.అకాల వర్షానికి వడ్లు తడుస్తుండగా  రైతులకు ఆర్మీ జవాన్లు సాయం చేశారు.   నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధి ఇబ్రహీంపేట స్టేజీ వద్ద ప్రధాన రోడ్డు వెంట రైతులు వడ్లను ఎండబెట్టారు.