- రూ.2.50 లక్షల సరుకు పట్టివేత
- మరో చోట 20 డిఫెన్స్ మద్యం బాటిల్స్పట్టివేత
హైదరాబాద్ సిటీ, వెలుగు : ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్లో తీసుకువస్తున్న రూ.2.25 లక్షల విలువైన 76 మద్యం బాటిళ్లను సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులు, డిస్ట్రిక్ట్టాస్క్ఫోర్స్టీమ్, స్టేట్టాస్క్ఫోర్స్పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ టీం చేసిన సోదాల్లో హర్యానా నుంచి తెస్తున్న 24 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని.. రంగారెడ్డి జిల్లాకు చెందిన మెట్టు సందీప్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో జానీ వాకర్, రెడ్ లెబుల్, బలేటైన్ వంటి బ్రాండ్స్ఉన్నాయి. ఇదే రైలు మరో బోగీలో డీటీఎఫ్తనిఖీ చేయగా జమ్మూ కాశ్మీర్ సీఆర్ పీఎప్క్యాంటీన్నుంచి తెస్తున్న46 లిక్కర్బాటిల్స్దొరికగా, నిందితులు పారిపోయారు. మరో బోగీలో టాస్క్ ఫోర్స్ చెక్చేయగా ఆరు బాటిల్స్దొరికాయి. వీరు కూడా పారిపోయారు. మొత్తం పట్టుకున్న మద్యం విలువ రూ.2.25 లక్షల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు.
కిరాణాషాపులో ఎక్స్ఆర్మీమెన్అమ్మకాలు
యాప్రాల్ లోని ఎంప్లాయీస్ కాలనీలో డిఫెన్స్ బాటిల్స్ అమ్ముతున్న ఎక్స్సర్వీస్మెన్బాలకృష్ణను ఎస్టీఎఫ్పోలీసులు పట్టుకున్నారు. ఆయన కిరాణంలో 20 డిఫెన్స్ బాటిల్స్ దొరికాయి. ఎక్స్ సర్వీస్ మెన్ గా తనకు వచ్చిన లిక్కర్బాటిల్స్తో పాటు మద్యం తాగని అలవాటు ఉన్న మాజీ ఎక్స్సర్వీస్మెన్స్దగ్గర బాటిల్స్తీసుకుని అమ్ముతున్నాడు. పట్టుకున్న మద్యం విలువ రూ. 40 వేలు ఉంటుందని తెలిపారు.