Manipur: మణిపూర్‌లో ఆర్మీ అధికారి కిడ్నాప్‌.. రక్షించిన భద్రతా బలగాలు

మణిపూర్‌‌లో ఆర్మీ అధికారి కిడ్నాప్ కలకలం రేపింది. తౌబాల్ జిల్లాకు చెందిన జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) కొన్సమ్ ఖేదా సింగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం(మార్చి 8) ఉదయం 9 గంటల సమయంలో ఆయన ఇంటి నుంచి కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు దాదాపు 10 గంటల పాటు శ్రమించి ఆయనను రక్షించాయి.

ALSO READ :-Rajamouli Premalu Review: నా ఫేవరెట్‌ మాత్రం ఆదినే..ప్రేమలు మూవీపై రాజమౌళి ప్రశంసలు

సమాచారం అందిన వెంటనే జేసీవోను కాపాడేందుకు ఆర్మీ భద్రతా సంస్థలచే సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టామని, 102వ జాతీయ రహదారిపై అన్ని వాహనాలను తనిఖీ చేశామని భద్రతాధికారులు తెలిపారు. సాయంత్రం 6:30 గంటలకు JCO సురక్షితంగా రక్షించినట్లు ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. గత మే నెలలో మణిపూర్‌లో హింసాకాండ చెలరేగినప్పటి నుంచి ఇది నాలుగో ఘటన. సెలవులో ఉన్న సైనికులు, విధుల్లో ఉన్నవారు లేదా వారి బంధువులను విద్వేషకారులు లక్ష్యంగా చేసుకుంటున్నారు.