జమ్మూకాశ్మీర్లో ఎన్కౌంటర్..ఆర్మీ ఆఫీసర్ మృతి, ముగ్గురు జవాన్లకు తీవ్రగాయాలు

జమ్మూకాశ్మీర్లో ఎన్కౌంటర్..ఆర్మీ ఆఫీసర్ మృతి, ముగ్గురు జవాన్లకు తీవ్రగాయాలు

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ లోని కిష్త్వార్ లో టెర్రరిస్టులకు, ఆర్మీ బలగాలు మద్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ అధికారి మరణించారు. మరో ముగ్గు రు సైనికులు గాయపడ్డారు. కిష్త్వార్ లోని భార్డ్ రిడ్జ్ లో జరుగుతు జాయింట్ కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ నాయబ్ సుబేదార్ రాకేష్ కుమార్ మృతిచెందినట్లు ఆర్మీ 16 కార్ప్స్ తెలిపింది. 

ఇటీవల ఇద్దరు వీడీజీల హత్య తర్వాత భద్రతాదళాలు యాంటీ టెర్రర్ ఆపరేషన్ నిర్వహించారు. VDG లు నజీర్ అహ్మద్ , కుల్దీప్ కుమార్ లను టెర్రరిస్టులు కాల్చి చంపారు. ఆ ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో సైన్య , పోలీసులు సంయుక్తంగా యాంటీ టెర్రర్ ఆపరేషన్ నిర్వహించారు. ఉగ్రవాదులు ఎదురు పడటంతో కాల్పులు జరిపాయి.