జమ్మూకాశ్మీర్‪లో ఉగ్రవాదుల ఎదురు కాల్పులు.. ఆర్మీ కెప్టెన్ వీరమరణం

జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలోని అస్సార్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ మరణించాడు. జమ్మూ ప్రాంతంలో ఈ ఏడాది తీవ్రవాద కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి. దీంతో గతకొన్ని రోజులుగా భారత బలగాలు ఆయా ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందాడు. 

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో కెప్టెన్ M4 రైఫిల్, బట్టలు, మూడు బ్యాగులను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకుంది. అస్సార్ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దోడాలోని శివగఢ్, -అస్సార్ బెల్ట్‌లో ఉగ్రవాదులు దాక్కున్నట్లు ఆర్మీ అధికారులు భావిస్తున్నారు.