న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని డెమ్‌చోక్‌లో పెట్రోలింగ్ ప్రారంభించినట్టు ఇండియన్ ఆర్మీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. తూర్పు లద్దాఖ్‌లోని డెమ్‌చోక్, డెప్సాంగ్ అనే రెండు ఫ్రిక్షన్ పాయింట్ల వద్ద ఇండియా, చైనా తమ బలగాలను ఉపసంహరించుకున్నాయి. ఈ పాయింట్ల వద్ద పెట్రోలింగ్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని బుధవారమే ఇండియన్ఆర్మీ ప్రకటించింది. మరోవైపు దీపావళి సందర్భంగా వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంట పలు బార్డర్పాయింట్ల వద్ద ఇండియా, చైనా సైనికులు స్వీట్లు పంచుకు న్నారు.
ఈ ప్రాంతాల్లో 2020 ఏప్రిల్‌కు ముందు పెట్రోలింగ్ స్థితికి తీసుకురావాల ని ఇరుదేశాలు ఇటీవల నిర్ణయానికి వచ్చాయి. అందులో భాగంగానే గ్రౌండ్ కమాండర్ల స్థాయిలో చర్చించి పెట్రోలింగ్ విధానాలపై నిర్ణయం తీసుకుటాయని బలగాల విత్‌డ్రా సందర్భంగా తెలిపాయి. 2020 జూన్‌లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత తూర్పు లడఖ్‌లోని ఎల్ఏసీ వెంబడి పెరిగిన ఉద్రిక్తతలను తగ్గించే విషయంలో ఇరు దేశాలు పెద్ద ముందడుగు వేశాయి.