
నిజామాబాద్, వెలుగు : జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ గవర్నమెంట్డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో సోమవారం సాయంత్రం ఆర్మీ పారా గ్లైడింగ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సికింద్రాబాద్ ఆర్మీ కంటోన్మెంట్ పారా మోటార్ ఎక్స్‌పెడిషన్ 2025 పేరుతో ఢిల్లీలో చేపట్టిన యాత్ర ఆగ్రా, కాన్పూర్, ఝాన్సీ, సాగర్, జబల్పూర్, పుల్గాం మీదుగా ఇందూర్ చేరుకుంది.
లెఫ్టినెంట్ కల్నల్ అమృత్ నేతృత్వంలోని టీంకు అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ స్వాగతం పలికారు. కాలేజీలోని ఎన్సీసీ క్యాడెట్లు, యూత్‌కు అవగాహన, ఆసక్తి కలిగించేలా పారా గ్లైడింగ్ విన్యాసాలు ప్రదర్శించారు. డీఎస్వో అరవింద్‌రెడ్డి, సివిల్ సప్లై డీఎం శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.