లడఖ్ లో ఆకస్మిక వరదలు.. నదిలో కొట్టుకుపోయిన జవాన్లు

లడఖ్ లో ఆకస్మిక వరదలు.. నదిలో కొట్టుకుపోయిన జవాన్లు

హిమాలయ పర్వతాల మధ్య ఉన్న లడఖ్ లో ఆకస్మిక వరదలు వచ్చాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు భారత జవాన్లు గల్లంతు అయ్యారు. వీరిలో ఓ జవాన్ మృతదేహాన్ని దొరకగా.. మరో నలుగురు జవాన్ల కోసం గాలిస్తున్నారు ఆర్మీ సిబ్బంది. 

2024, జూన్ 29వ తేదీ ఉదయం.. లడఖ్ ప్రాంతంలోని ఆర్మీ క్యాంప్ దగ్గర యుద్ధ ట్యాంకులతో సన్నాహాలు చేస్తుంది మన సైన్యం. ఈ క్రమంలోనే లడఖ్ ఏరియాలోని భారత ఆర్మీకి చెందిన యుద్ధ ట్యాంక్ టీ72.. ష్యోక్ అనే నదిని దాటుతుంది. సరిగ్గా నది మధ్యలోకి యుద్ధ ట్యాంక్ రాగానే.. నది నీటి మట్టం ఒక్కసారిగా.. అమాంతం పెరిగింది. ఆకస్మిక వరదలతో యుద్ధ ట్యాంక్ మునిగిపోయింది. అందులోని ఐదుగురు భారత సైన్యం.. బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు జవాన్లు.

ప్రమాదాన్ని గుర్తించిన మిగతా జవాన్లు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గల్లంతు అయిన జవాన్ల కోసం గాలించగా.. ఒకరి మృతదేహం లభించిందని.. మరో నలుగురి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు సమాచారం. గల్లంతు అయిన వారిలో ఓ ఆర్మీ అధికారి కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.