ముంబై పోలీస్ కమిషనర్‌పై రూ. 200 కోట్ల దావా వేస్తా

ముంబై పోలీస్ కమిషనర్‌పై రూ. 200 కోట్ల దావా వేస్తా

ముంబై: టీఆర్పీ స్కామ్ లో ఆరోపణలు చేసిన ముంబై పోలీసు కమిషనర్ పరమ్ వీర్ సింగ్ పై రిపబ్లిక్ టీవీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. రూ.200 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్‌ చీఫ్‌ అర్ణబ్ గోస్వామి సోమవారం ప్రకటించారు.  టీఆర్పీ కేసులో రిపబ్లిక్ టీవీ పేరు లేదని సోమవారం బాంబే హైకోర్టులో మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసుల తరపు లాయర్ చెప్పారని అన్నారు. పరమ్ వీర్ సింగ్ ఆరోపణలతో తమకు సంబంధం లేదని మహారాష్ట్ర గవర్న మెంట్ ఓపెన్ కోర్టులో ఒప్పుకుందని చెప్పారు. రిపబ్లిక్ టీవీ టీఆర్పీ కోసం మాల్ ప్రాక్టీస్ చేయలేదని స్పష్టం చేశారు. దురుద్దేశంతో ఎలాంటి ఆధారాలు లేకుండానే పరమ్ వీర్ సింగ్  రిపబ్లిక్ టీవీపై తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. తన రెప్యుటేషన్ ను దెబ్బ తీసినందుకు రూ.100 కోట్లు, రిపబ్లిక్ మీడియా నెట్ వర్క్ కు నష్టం కలిగించినందుకు మరో 100 కోట్లు చెల్లించాలని దావా వేస్తామన్నారు. ఇప్పటికే పరువు నష్టం దావా వేసే ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టు తెలిపారు.