ఫిజికల్ అటాక్ ఆరోపణలను తిరస్కరించిన కోర్టు
కేసు కొట్టేయాలని బాంబే హైకోర్టులో అర్ణబ్ పిటిషన్, విచారణ నేటికి వాయిదా
ముంబై: రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామికి ముంబై అలీబాగ్ లోని కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అరెస్టు సమయంలో తనపై ఫిజికల్ అటాక్ జరిగిందన్న ఆయన ఆరోపణలను కోర్టు తిరస్కరించింది. 2018లో ఆర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, అతని తల్లి సూసైడ్ కు కారణమయ్యారన్న కేసులో అర్ణబ్ ను ముంబై పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గత ప్రభుత్వ హయాంలో మూసివేసిన ఈ కేసును ఆర్కిటెక్ట్ ఫ్యామిలీ అప్పీల్ మేరకు రీఓపెన్ చేశారు. ‘అర్ణబ్ ను అరెస్టు చేయాలని ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నాం. ఫైనల్ గా మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. నిష్పక్షపాతమైన విచారణ జరపాలి’ అని అన్వయ్ నాయక్ భార్య అక్షత నాయక్ చెప్పారు. మరోవైపు తన అరెస్టును సవాల్ చేస్తూ అర్ణబ్ గోస్వామి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనను అక్రమంగా అరెస్టు చేశారని, అలీబాగ్ పీఎస్ లో దాఖలైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. అర్ణబ్ పిటిషన్ పై విచారణను బాంబే హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
బీజేపీ నేతలపై శివసేన ఫైర్
అర్ణబ్ అరెస్టుకు సంబంధించి మహారాష్ట్ర సర్కారుపై బీజేపీ నేతల కామెంట్స్ ను శివసేన ఖండించింది. మహారాష్ట్రలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి ఉందని కేంద్ర మంత్రులు, స్టేట్ బీజేపీ లీడర్స్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని తన అధికారిక పత్రిక సామ్నా ఎడిటోరియల్ లో పేర్కొంది. గత ప్రభుత్వం ఈ కేసును కప్పిపుచ్చిందని ఆరోపించింది. ఒక అమాయకుడు, తల్లితోపాటు సూసైడ్ చేసుకుంటే.. అతడి భార్య న్యాయం కోసం డిమాండ్ చేస్తుంటే.. పోలీసులు రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నారని తెలిపింది.
For More News..