- మస్క్‌ను మరోసారి అధిగమించిన ఫ్రెంచ్ బిలియనీర్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన లిస్టులో టెస్లా బాస్ ఎలన్ మస్క్‌ను దాటి నెంబర్ వన్ పొజిషన్‌ను ఫ్రెంచ్ బిజినెస్ మ్యాన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ మరోసారి దక్కించుకున్నారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ లిస్ట్ ప్రకారం, ఆర్నాల్ట్ నెట్ వర్త్ 207.8 బిలియన్ డాలర్లకు ఎగసింది. ఇది మస్క్ సంపద 204.5 బిలియన్ డాలర్లను అధిగమించింది. ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలియనీర్ లిస్టులో టాప్ 10 లో ఇండియా నుంచి ఎవరూ లేరు. 11 వ ప్లేస్‌లో ముకేశ్ అంబానీ, 16 వ ప్లేస్ గౌతమ్ అదానీ ఉన్నారు.