హైదరాబాద్, వెలుగు: పదేండ్ల పాటు ఆరోగ్యశ్రీని నీరుగార్చి, ఇప్పుడు అదే పథకం గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం చూస్తుంటే.. దొంగే దొంగ అని అరిచినట్లు ఉందని వైద్య, ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో హాస్పిటళ్లకు డబ్బులు చెల్లించలేదని, ప్యాకేజీల ధరలు రివైజ్ చేయలేదని ఆదివారం ‘ఎక్స్’ లో ఆయన తెలిపారు.
సుమారు రూ.730 కోట్లు బాకీపెట్టి పోయారని మండిపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ముందుకు పోతున్నామని చెప్పారు. పాత బకాయిలతో సహా రూ.1,130 కోట్లు ఏడాది కాలంలో చెల్లించామని తెలిపారు. ప్రతినెలా ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేస్తున్నామని, ప్యాకేజీల రేట్లు రివైజ్ చేసి 22 శాతం మేర చార్జీలు పెంచామని వెల్లడించారు.