
హుజురాబాద్ లో పోలింగ్ రోజు కూడా ప్రలోభాలు జరుగుతున్నాయి. ఓ వైపు పోలింగ్ జరుగుతుండగానే మరో వైపు టీఆర్ఎస్ నేతలు పోలింగ్ బూత్‌ల వద్ద డబ్బులు పంచుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే (వర్ధన్నపేట) ఆరూరి రమేష్ పీఏ కిరణ్ డబ్బులు పంచుతుండగా బీజేపీ కార్యకర్తలు పట్టుకున్నారు. హుజురాబాద్ 51వ పోలింగ్ బూత్ పరిధిలో డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ నేతలను బీజేపీ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.