న్యూఢిల్లీ : ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా రూ.20 వేల కోట్లు సేకరించడానికి సుమారు 10 కంపెనీలు రెడీ అవుతున్నాయి. రిటైల్ కంపెనీ విశాల్ మెగా మార్ట్, బ్లాక్‌స్టోన్‌కు చెందిన డైమండ్ గ్రేడింగ్ కంపెనీ ఇంటర్నేషనల్ జెమ్మలాజికల్ ఇన్‌స్టిట్యూట్ (ఇండియా) వంటివి వచ్చే నెలలో ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి. ఎడ్యుకేషన్ లోన్లు ఇచ్చే ఎన్‌బీఎఫ్‌సీ అవాన్సే ఫైనాన్షియల్ సర్వీసెస్, టీపీజీ క్యాపిటల్‌కు వాటాలున్న సాయి లైఫ్ సైన్సెస్, హాస్పిటల్ చెయిన్ పారాస్ హెల్త్‌కేర్
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్ కూడా డిసెంబర్‌లో తమ ఐపీఓలను లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ గెలవడం, యూపీ బైఎలక్షన్‌లో కూడా బీజేపీ ఆధిపత్యం కొనసాగడంతో మార్కెట్ లాభాల్లో కదులుతుందని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా ఐపీఓ మార్కెట్ పాజిటివ్‌గా ఉంటుందని అన్నారు.
ఎన్విరో ఇన్‌ఫ్రా ఐపీఓకి 26 చివరి తేది..
ఈ నెల 22 న ఓపెనైన ఎన్విరో ఇన్‌ఫ్రా ఇంజనీర్స్ ఐపీఓ, ఈ నెల 26 తో ముగుస్తుంది. ఫేస్ వాల్యూ రూ.10 ఉన్న ఒక్కో షేరుని రూ.140–148 ప్రైస్ రేంజ్‌లో అమ్ముతున్నారు. కనీసం 101 షేర్ల కోసం బిడ్ వేయాలి. అప్పర్ బ్యాండ్ వద్ద కనీస పెట్టుబడి విలువ రూ.14,948. ఎన్విరో ఇన్‌ఫ్రా ఐపీఓ మొదటి రోజు 2.08 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది.