దొంగతనానికి కాదేదీ అనర్హంగా మారింది. ఆఖరికి దేవుడిని వదిలిపెట్టడం లేదు. సిద్దిపేట జిల్లా కోహెడ పోచమ్మ గుడి ఆవరణలో ప్రతిష్టించిన వినాయక విగ్రహం మెడలో నుంచి సుమారు రూ.5 వేల డబ్బుల దండా చోరీ జరిగింది. అర్థరాత్రి సమయంలో అందరూ నిద్ర పోతుండగా ఓ కేటుగాడు గణేషుడి మండపంలోకి ప్రవేశించాడు. ఎవరూ లేరని నిర్థారించుకున్న తర్వాత స్వామివారి మెడలో ఉన్న డబ్బుల దండను తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. విషయం తెలుసుకున్న నిర్వాహకులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
మరోవైపు జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాణి నగర్ వీధి ధర్మశాల వద్ద వినాయకుడికి నైవేద్యంగా పెట్టిన లడ్డు చోరికి గురైంది. వినాయక భక్త బృందం దొంగను పట్టుకొని దేహశుద్ధిచేశారు. లడ్డు చోరీ చేసిన దొంగ ఓ బొర్వెల్ లో పనిచేస్తున్న నాగరాజుగా గుర్తించారు. డయల్ 100కు ఫోన్ చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని దొంగను అదుపులోకి తీసుకున్నారు .