యాదగిరి గుట్టలో ఈనెల 18న గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టనున్నారు ఆలయ అధికారులు. స్వాతి నక్షత్రం పురస్కరించుకుని ఉదయం 5గంటల 30నిమిషాలకు శ్రీలక్ష్మీనర్సింహాస్వామివారి గిరి ప్రదక్షిణను ప్రారంభించనున్నారు. దీంతో ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు ఆలయ ఈవో భాస్కరరావు. గిరి ప్రదక్షిణలో సుమారు 5వందల మంది పాల్గొంటారన్నారు భాస్కరరావు. ఆతర్వాత భక్తులకు ఉచితంగా స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుందన్నారు.
2016లో ఆలయాన్ని పునర్నిర్మించడంతో భక్తులకు గిరి ప్రదక్షిణ చేయడానికి ఇబ్బందిగా మారింది. ఇక ఇప్పుడు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే.. పాత ఆచారాలను పునరుద్దరించాలని నిర్ణయించారు అధికారులు. గతంలో స్థానికులకు మాత్రమే గిరి ప్రదక్షిణ చేసేవారు. కానీ అరుణాచలం, సింహాచలం తరహాలో భక్తులందరికీ ఈ అవకాశాన్ని కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు టెంపుల్ ఆఫీసర్లు. స్వామి వారి కొండ చుట్టూ రెండున్నర కిలోమీటర్ల మేర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.