జీహెచ్‌ఎంసీలో ఫేషియల్ అటెండెన్స్ సిస్టమ్..

జీహెచ్‌ఎంసీలో ఫేషియల్ అటెండెన్స్ సిస్టమ్..


హైదరాబాద్:జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల్లో ఫేషియల్ అటెండెన్సీ విధానం అమలుకు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం ( సెప్టెంబర్ 21) న జీహెచ్ ఎంసీ హెడ్ ఆఫీసులో ఏఐ ఆధారంగా పనిచేసే ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ ద్వారా ఉద్యోగుల ఫేషియల్ రికగ్నిషన్ నమోదు చేశారు. 

సంస్థలో మొత్తం 14 విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ముఖాన్ని మొబైల్ బేస్డ్ యాప్ ద్వారా క్యాప్చర్ చేయడం ద్వారా అటెండెన్స్ నమోదు అవుతుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది. జీహెచ్ ఎంసీ పరిధిలోని మొత్తం 39విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది హాజరుకు ఫేషియల్ రికగ్నీషన్ అటెండెన్స్ సిస్టమ్ ను  సిద్దం చేస్తున్నారు. 

ఇంతకు ముందు కార్పొరేషన్ పరిధిలో ఆధార్ ఆధారంగా బయోమెట్రిక్ హ్యాండ్ హెల్డ్ డివైజ్ తో అటెండెన్స్ విధానాన్ని ఉపయోగించారు. ఈ సిస్టమ్ తో పారిశుధ్య కార్మికులు దుర్వినియోగం చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో తొలగించారు. 

ఆ తర్వాత జీహెచ్ ఎంసీ పరిధిలోని శానిటరీ వర్కర్స్ కు ఫేషియల్ రికగ్నీషన్ అటెండెన్స్ ను అమలు చేస్తున్నారు. ఈ విధానంతో పారదర్శకంగా , కచ్చితత్వంతో కూడిన అటెండెన్స్ నమోదు అవుతుందని జీహెచ్ ఎంసీ అధికారులు చెబుతున్నారు.