వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం : ఖమ్మంలోని కాల్వ ఒడ్డు మున్నేరులో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు సీపీ సునీల్ దత్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య పర్యవేక్షణలో చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. మొన్నటివరకు వరదలలతో ఆగమాగమైన మున్నేరు పరీవాక ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాయి. నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అధికారులు జేసీబీలతో భూమిని చదను చేయిస్తున్నారు. విగ్రహాలను ఎత్తేందుకు భారీ క్రేన్లను రప్పించారు.
ఆయా ఏరియాల నుంచి మున్నేరు కు చేరే వినాయక ఊరేగింపు వాహనాలకు రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గజ ఈతగాళ్లను, వైద్య శిబిరాల సౌకర్యాలను అందుబాటులో ఉంచనున్నారు.