
మొగుళ్లపల్లి,వెలుగు : మొగుళ్లపల్లి – ములకలపల్లి గ్రామాల మధ్య నాలుగు రోజులపాటు జరిగే మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. సోమవారం మండల స్పెషల్ ఆఫీసర్ సునీత, తహసీల్దార్ సునీత, ఎంపీడీవో జయశ్రీ పర్యటించారు. ఆఫీసర్లు, జాతర నిర్వాణ కమిటీ సభ్యులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్ఐ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.