సమగ్ర కుటుంబ సర్వేకు ముమ్మర ఏర్పాట్లు: కలెక్టర్​ అద్వైత్ ​కుమార్​సింగ్​

సమగ్ర కుటుంబ సర్వేకు ముమ్మర ఏర్పాట్లు: కలెక్టర్​ అద్వైత్ ​కుమార్​సింగ్​

మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ఈ నెల6 నుంచి ప్రారంభించడానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయని మహబూబాబాద్​ కలెక్టర్​అద్వైత్​కుమార్​సింగ్​తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 487 గ్రామపంచాయతీల పరిధిలో, 1330 ఆవాసాల్లో, 3997 వార్డుల పరిధిలో 216361 హౌస్​ హోల్డ్స్​ను కవర్​ చేయనున్నట్లు చెప్పారు. 1584 మంది ఎన్యూమ రేటర్లు, 171 మంది సూపర్ వైజర్లు, విధుల్లో పాల్గొననున్నారని తెలిపారు. సర్వేకు అన్ని శాఖల ఆఫీసర్లు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు.