ఇండియా–ఇంగ్లండ్‌‌ తొలి టెస్ట్‌‌కు జోరుగా ఏర్పాట్లు

ఇండియా–ఇంగ్లండ్‌‌ తొలి టెస్ట్‌‌కు జోరుగా ఏర్పాట్లు

హైదరాబాద్‌‌ : ఉప్పల్‌‌ స్టేడియంలో జరగనున్న ఇండియా–ఇంగ్లండ్‌‌ తొలి టెస్ట్‌‌కు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులను అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ సభ్యులతో కలిసి హెచ్‌‌సీఏ ప్రెసిడెంట్‌‌ అర్శనపల్లి జగన్‌‌మోహన్‌‌ రావు  గురువారం పరిశీలించారు. పిచ్‌‌, గ్రౌండ్‌‌, అవుట్‌‌ ఫీల్డ్‌‌ పనులను తనిఖీ చేశారు. మ్యాచ్‌‌ను విజయవంతంగా నిర్వహించేందుకు హెచ్‌‌సీఏ కార్యవర్గం మొత్తం స్టేడియంలోనే ఉంటున్నారని జగన్‌‌ చెప్పారు. డే టైమ్‌‌లో ఎండ తగలకుండా రూఫ్‌‌ టాప్‌‌, కొత్త సీట్ల ఏర్పాటును సకాలంలో పూర్తి చేశామన్నారు.

ఆటగాళ్ల డ్రెస్సింగ్‌‌ రూమ్స్‌‌, శానిటేషన్‌‌ వర్క్స్‌‌ కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు. మరోవైపు టెస్ట్‌‌ మ్యాచ్‌‌ను వీక్షించేందుకు గవర్నమెంట్‌‌ గుర్తింపు కలిగిన స్కూల్స్‌‌ విద్యార్థులను ఉచితంగా అనుమతి ఇస్తామని చెప్పారు. ఇందుకోసం గైడ్‌‌లైన్స్‌‌ రూపొందించామన్నారు. స్కూల్‌‌ ప్రిన్సిపాల్స్‌‌ ఈనెల 18 లోపు హెచ్‌‌సీఏ సీఈవో  ఈ మెయిల్ ఐడీ (ceo.hydca@gmail.com)కి విద్యార్థులు, స్టాఫ్‌‌ ఎంత మంది వ‌‌స్తున్నారో, వారి సంఖ్య, పేర్లను పంపించాల‌‌ని తెలిపారు.

ఈసారి భాగ్యనగరంలో..

బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమాన్ని ఈసారి భాగ్యనగరంలో నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ నెల 23న ఈ ప్రోగ్రామ్‌‌ జరగనుంది. ఇండియా, ఇంగ్లండ్‌‌ ప్లేయర్లు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. చివరిసారి 2020లో ముంబైలో ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత కొవిడ్‌‌ కారణంగా మళ్లీ దాన్ని జరపలేదు. కాబట్టి ప్రోగ్రామ్‌‌ను భారీ ఎత్తున నిర్వహించేందుకు బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌