ఇంటర్‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌కు ఏర్పాట్లు పూర్తి

జనగామ అర్బన్, వెలుగు : ఇంటర్‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జనగా అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పర్మర్‌‌‌‌‌‌‌‌ పింకేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. బుధవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌కు 4,360 మంది, సెకండ్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌కు 4,781 మంది హాజరుకానున్నట్లు చెప్పారు.

ఈ ఎగ్జామ్స్​కు జిల్లాలో 18 సెంటర్లు కేటాయించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్‌‌‌‌‌‌‌‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టికల్‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌ జరగనున్నాయన్నారు. స్టూడెంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ బస్సులను నడపాలని ఆదేశించారు. రివ్యూలో డీఐఈవో శ్రీనివాస్, డీఈవో కె.రాము, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ చంద్రమౌళి, ఆర్టీసీ డీఎం వి.జ్యోత్స్న పాల్గొన్నారు.