
- దేవస్థాన బడ్జెట్ నుంచిరూ. 2.50 కోట్లు కేటాయింపు
- భక్తులకు శాశ్వత ప్రాతిపదికన సదుపాయాలు
- పలు ఏరియాల్లో కొనసాగుతోన్న నిర్మాణ పనులు
భద్రాచలం, వెలుగు: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ప్రభుత్వం సౌలత్ లను కల్పిస్తోంది. ఏప్రిల్ 6న శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివస్తారు. మరోవైపు నిత్యం శ్రీరామదర్శనం కోసం10 వేల నుంచి 15వేల మంది భక్తులు వస్తున్నారు. కాగా.. టౌన్ లోని ప్రధాన ఏరియాల్లో మరుగుదొడ్ల సమస్య ఉంటుంది.
కేవలం నవమి వేడుకల సమయంలో మాత్రమే తాత్కాలికంగా నిర్మిస్తుంటారు. మిగిలిన రోజుల్లో భక్తుల ఇబ్బందులను పట్టించుకునేవారే లేరు. దీంతో ఆలయ సందర్శనకు వచ్చే భక్తులకు శాశ్వతంగా సదుపాయాలు కల్పించేందుకు జిల్లా కలెక్టర్జితేశ్ వి పాటిల్చర్యలు తీసుకున్నారు.
దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు
ఈసారి బ్రహ్మోత్సవాలకు రూ.2.50కోట్లను శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం బడ్జెట్ లో కేటాయించింది. అవసరమయ్యే పనుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. త్వరలో టెండర్లను పిలువనున్నారు. భక్తులకు ప్రసాదాలు, కల్యాణ తలంబ్రాలు, తాగునీరు, కల్యాణ దర్శనం, తాత్కాలిక వసతి వంటివి కల్పిస్తారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని గోదావరి తీరంతో పాటు, మిథిలాస్టేడియం చుట్టూ చలువ పందిళ్ల నిర్మాణం చేపడతారు. ఆయా ప్రాంతాల్లో గోదావరి తాగునీటి నల్లాలు, చలువ పందిళ్లలో ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేస్తారు.
స్పీడ్ గా టాయిలెట్ల నిర్మాణాలు
గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పలు ఏరియాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను అధికారులు చేపట్టారు. ఆర్టీసీ బస్టాండు అవుట్గేట్ఎదుట పనులు స్పీడ్ గా కొనసాగుతుండగా.. గోదావరి వంతెన నుంచి కరకట్ట కింద రోడ్డు ద్వారా గుడికి వెళ్లే రూట్ లో రెవెన్యూ గెస్ట్ హౌస్ఎదురుగా, సాధువుల మండ పం, పాత కూరగాయల మార్కెట్ జూనియ ర్ కాలేజీ గ్రౌండ్గోడను ఆనుకుని, డిగ్రీ కాలేజీ వద్ద, గుడికి వెళ్లే రూట్ లో శ్రీసీతారామ ఆఫీసర్స్ క్లబ్వద్ద వీటి నిర్మాణాలను చేస్తున్నారు.
ఆయా పనులు హైదరాబాద్ కు చెందిన ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. స్థలం మాత్రమే పంచాయతీ కేటాయించింది. సులభ్కాంప్లెక్స్ నిర్వాహకులే చేపట్టి.. 12 ఏండ్ల పాటు బాధ్యతలు తీసుకుంటా రు. ఇందుకు ఏటా రూ.18వేలు స్థల లీజు కింద పంచాయతీకి చెల్లిస్తారు.
త్వరలో టెండర్లు పిలుస్తాం
శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు సంబంధించి టెండర్లను త్వరలో పిలుస్తాం. ఇప్పటికే పనుల జాబితాను సిద్ధం చేశాం. ఉన్నతాధికారులు పరిశీలించాక ప్రారంభిస్తాం. భక్తుల ఇబ్బందులు రాకుండా పనులు డిజైన్చేస్తున్నాం. - రవీందర్రాజు, ఈఈ, శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం