భద్రాద్రిలో నవమి ఉత్సవాలకు ఏర్పాట్లు

  • తలంబ్రాలకు 40, ప్రసాద విక్రయాలకు 15 కౌంటర్లు
  • భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్​ ఎంవీ రెడ్డి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం​లో శ్రీరామ నవమి, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్టు కలెక్టర్​ ఎంవీ రెడ్డి చెప్పారు. శ్రీరామనవమి ఉత్సవాలపై వివిధ డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లతో కలెక్టరేట్​లో సోమవారం రివ్యూ నిర్వహించారు. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సవాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. రాముడు నడిచిన ఈ నెలలో భక్తిభావం ఉట్టిపడేలా ఏర్పాటు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు పట్టణంలోని మెయిన్​ రోడ్లలో ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేయాలన్నారు. టెంపుల్​ మొత్తాన్ని కలర్​ లైట్లతో అలంకరించాలన్నారు. తలంబ్రాల కోసం 40, ప్రసాదాలకు 15 కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆన్​లైన్​లోనూ దర్శన టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.  ఎమర్జెన్సీగా వైద్యం అందించేందుకు 12 చోట్ల హెల్త్​ క్యాంప్​లు, నాలుగు అంబులెన్స్​లు, భద్రాచలం ఏరియా హాస్పిటల్​లో 10 పడకలను రెడీగా ఉంచాలని ఆదేశించారు. కరోనా రూల్స్​ పాటిస్తూ ఏర్పాట్లు చేయాలని సూచించారు. మీటింగ్​లో అడిషనల్​ కలెక్టర్​ డి.అనుదీప్​, టెంపుల్​ ఈవో శివాజీ, డీఆర్​వో అశోక్​ చక్రవర్తి పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి 

అప్పుడు పబ్‌‌.. ఇప్పుడు వైల్డ్‌‌లైఫ్‌‌ హాస్పిటల్‌‌

రింగు డాన్స్‌‌తో గిన్నిస్ రికార్డ్

కారు యాక్సిడెంట్.. పోలీసులకు బంగారం అప్పగించిన 108 సిబ్బంది