- ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు
- మధ్యాహ్నం వరకు వెలువడనున్న ఫలితం
- రిజల్ట్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న క్యాండిడేట్లు, పాలమూరు ప్రజలు
మహబూబ్‌నగర్/ నాగర్ కర్నూల్, వెలుగు: హోరాహోరీగా సాగిన పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్కర్నూల్లోక్సభ స్థానాల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పాలమూరు యూనివర్సిటీ పరీక్షల విభాగంలో మహబూబ్ నగర్, నెల్లికొండ వ్యవసాయ మార్కెట్గోదాములో నాగర్‌కర్నూల్‌పార్లమెంట్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. సీసీ కెమెరాలు, కేంద్ర బలగాలు, పోలీసు శాఖ పటిష్ఠ బందోబస్తు నడుమ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
మధ్యాహ్నం వరకు విన్నర్లను ప్రకటించే చాన్స్ ఉంది. ఇప్పటికే కౌంటింగ్‌లో నిమగ్నమయ్యే ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారు. ప్రతి కౌంటింగ్టేబుల్ వద్ద ఒక సూపర్ వైజర్, ఇద్దరు హెల్పర్లు, ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమించారు.మహబూబ్‌నగర్ లో 31 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, బీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్నారు.
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నుంచి మొత్తం 19 మంది బరిలో ఉండగా, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీజేపీ నుంచి పి.భరత్, బీఆర్‌ఎస్ నుంచి ఆర్ఎస్ప్రవీణ్ కుమార్పోటీ పడ్డారు. రెండు పార్లమెంట్లలో 10 మందికి మించి పోటీదారులు ఉండటంతో ప్రతి పోలింగ్సెంటర్లో డబుల్ ఈవీఎంలను ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ కు సంబంధించి కౌంటింగ్ కేంద్రంలో మొత్తం 98 టేబుళ్లు ఏర్పాటు చేయగా, ఒక్కో నియోజకవర్గానికి 14 చొప్పున కేటాయించారు.
రిజల్ట్‌పై క్యాండిడేట్లలో టెన్షన్
ఓట్లను లెక్కింపు నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ క్యాండిడేట్లలో టెన్షన్నెలకొన్నది. పోలింగ్‌ముగిసినప్పటి నుంచి ఇప్పటి వరకు బూత్‌స్థాయి, మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తమకు వచ్చిన ఓట్ల శాతాన్ని అంచనా వేసుకున్న క్యాండిడేట్లు రిజల్ట్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. మే 13న ఎన్నిక నిర్వహించగా, దాదాపు 20 రోజులుగా క్యాండిడేట్లు తమ పార్టీ ముఖ్య నేతలతో నియోజకవర్గాల వారీగా ఎన్నికల తీరుపై సమీక్షల్లో నిమగ్నమయ్యారు.
మీడియా, సర్వే సంస్థలు, ఇతర వర్గాల ద్వారా ఓటరు నాడిని అంచనా వేసేందుకు ప్రయత్నాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలోని రెండు పార్లమెంట్‌స్థానాలను సొంతం చేసుకుంటామని అధికార పార్టీ ధీమాగా ఉండగా, ప్రజలు తమ వైపే ఉన్నారని బీఆర్‌ఎస్ గెలుపుపై ఆశలు పెట్టుకుంది. ఈసారి ఎన్నికల్లో భారీ స్థాయిలో క్రాస్ ఓటింగ్‌జరిగిందని, సైలెంట్ఓటింగ్తో తమ క్యాండిడేట్లు గెలవబోతున్నారని బీజేపీ జోస్యం చెబుతోంది.