జిహెచ్ఎంసీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నిక సందర్భంగా 500 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇద్దరు అడిషనల్ డీసీపీలు, 15 ఎసిపిలు, 32 ఎస్ఐలు, 150 కానిస్టేబుళ్లు, 2 ఉమెన్ బెటాలియన్ లు మూడంచెల భద్రత ఉంటుంది.
మొదట లిబర్టీ సర్కిల్, రెండోది జీహెచ్ యంసి చుట్టూ ,మూడు జిహెచ్ఎంసీ లోపల…మార్షల్స్ కౌన్సిల్ లోపల వీరు కలెక్టర్ ఆదేశాలతో పనిచేస్తారు. కార్పొరేటర్ల వాహనాలు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టల్ లో పార్కింగ్ చేస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిహెచ్ ఎంసీలో పార్క్ చేసుకోవచ్చు. కొత్తగా ఎన్నికయిన వారు తమ ఐడితో రావాలి, వారిని డీసీలు దృవీకరిస్తారు. కౌన్సిల్ లో సభ్యులు ఎక్కడ కూర్చోవాలో రో- ఆఫీసర్లు తెలియజేస్తారు. ఇందులో 15 మంది తహసీల్దార్లు, మిగతా వారు టౌన్ ప్లానింగ్ విభాగం ఉన్నారు. ఎన్నికలకు సంబంధించి సెక్రెటరీ, సీపీఆర్ ఓ సెక్షన్ సిబ్బంది మాత్రమే రేపు విధులకు హాజరు అవుతారు. మిగతా వారికి సెలవు.
ఉదయం 10:45 కి జిహెచ్ ఎంసి కార్యాలయానికి కార్పొరేటర్లు చేరుకోవాలి.11 గంటల నుండి నాలుగు భాషల్లో ప్రమాణ స్వీకారం ప్రారంభం అవుతుంది. 12:30 వరకు అందరి చేత ప్రమాణ స్వీకారం పూర్తి చేస్తారు. 12:30 నుండి మేయర్ ఎన్నిక ప్రారంభం అవుతుంది. సభలో 97 మంది సభ్యలు ఉంటే మేయర్ ఎన్నికను ప్రారంభిస్తారు.హాజరైన వారిలో ఎక్కువ మంది ఎవరికి చేతులు లేపి ఆమోదాన్ని తెలియజేస్తారో వారే మేయర్. ఇదే పద్దతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. ఎన్నికయిన వారికి ఎన్నిక పత్రాన్ని అందజేస్తారు.