రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21న సిటీకి రానున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న కోటి దీపోత్సవంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ​కలెక్టర్​అనుదీప్​ దురిశెట్టి సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్టీఆర్ ​స్టేడియంలో పోలీస్, ఆర్ అండ్ బీ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ అధికారులతో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.