గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో డిసెంబర్ 27న నిర్వహించనున్న గుర్తింపు సంఘం ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్జీ 1 ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ఆఫీసర్లను ఆదేశించారు.
శుక్రవారం జీఎం ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ ప్రతి మైన్, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్, డిపార్ట్‌మెంట్ల వద్ద కార్మికులు ఓటేసేందుకు సౌకర్యాలు, భద్రత చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ పూర్తయ్యాక ఓట్ల లెక్కింపు కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మీటింగ్‌లో ఆఫీసర్లు రామ్మోహన్, లక్ష్మీనారాయణ, రాంమూర్తి, చిలుక శ్రీనివాస్, చంద్రశేఖర్, ఆంజనేయులు, ధనలక్ష్మి, డాక్టర్ కిరణ్‌రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.