ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి

ములుగు, వెలుగు: 2024-–25 వానకాలం సీజన్ ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ములుగు కలెక్టర్ దివాకర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో అడిషనల్​కలెక్టర్ మహేందర్ జీతో కలిసి రైస్ మిల్లర్ల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పారు. రైతుల సొమ్ము దుర్వినియోగం కాకుండా రైతులకు అందించే ట్రక్ షీట్ జారీచేసే విషయంలో జాగ్రత్తలు వహించాలన్నారు.

రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రంల్లోనే అమ్మేవిధంగా కరపత్రాలను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీసీఎస్​వో హైజార్ హుస్సేన్, సివిల్ సప్లై అధికారి బి.రాoపతి, డీసీవో సర్దార్ సింగ్, జీసీసీ మేనేజర్ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ములుగు శివారు మదనపల్లి రోడ్డులో తోపుకుంటపై ఉన్న మినీ ట్యాంక్ బండ్ ను కలెక్టర్ దివాకర పరిశీలించారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా ముందస్తుగా పర్యవేక్షించి, తహసీల్దరా విజయ్ భాస్కర్ కు పలు సూచనలు చేశారు.