
మహబూబాబాద్, వెలుగు : ఎలక్షన్ సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ శశాంక ఆదేశించారు. జిల్లా కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌ను బుధవారం ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెహికల్ పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని సూచించారు. స్టూడెంట్లకు ఇబ్బందులు కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో అలివేలు, తహసీల్దార్ భగవాన్‌రెడ్డి, అరుణ్‌కుమార్, ప్రిన్సిపాల్ జయలక్ష్మి ఉన్నారు. అనంతరం పోలింగ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎలక్షన్ డ్యూటీకి సెలెక్ట్ అయిన ఆఫీసర్లు, సిబ్బంది తప్పనిసరిగా ట్రైనింగ్ క్లాస్‌లకు హాజరుకావాలని ఆదేశించారు.
ఎలక్షన్ డ్యూటీ సక్రమంగా చేయాలి
జనగామ అర్బన్, వెలుగు : ఎలక్షన్ డ్యూటీని సక్రమంగా నిర్వహించాలని జనగామ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి విభాగాల వారీగా సిబ్బందిని కేటాయించామని రిటర్నింగ్ ఆఫీస్‌తో కో ఆర్డినేషన్ చేసుకుంటూ ప్రతిరోజు రిపోర్టు అందజేయాలని సూచించారు. ఎలక్షన్లు పూర్తయ్యే వరకు ఎవరూ లీవ్స్ పెట్టొద్దని చెప్పారు. అనంతరం ఈవీఎంలను భద్రపరిచే రూమ్‌ను అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ సుహాసిని, జనగామ రిటర్నింగ్ ఆఫీసర్ మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు.