డబుల్​ బెడ్రూంల పరిశీలనకు వచ్చిన కాంగ్రెస్​నేతల అరెస్ట్​

కరీంనగర్ లో నిర్మిస్తున్న డబల్​ బెడ్రూం ఇళ్ల పరిశీలనకు వచ్చిన కాంగ్రెస్​ శ్రేణులను పోలీసులు అరెస్ట్​ చేశారు. చింతకుంటలో నిర్మిస్తున్న ఇళ్లలో నాణ్యత లేవంటూ జిల్లా కాంగ్రెస్​నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు.  నగర కాంగ్రెస్​ అధ్యక్షుడు కోమటి రెడ్డి నరేందర్​రెడ్డి, మరి కొందరు నేతలతో ర్యాలీగా బయల్దేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, నేతలకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

ఈ కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొనాల్సి ఉండగా.. ఉదయమే ఆయనను హౌస్ అరెస్టు చేశారు.మొక్కు చెల్లించుకోవాలని చెప్పి వేడుకోవడంతో చివరకు వేములవాడకు వెళ్లడానికి ఆయనకు పర్మిషన్​ ఇచ్చారు. అరెస్ట్​ అయిన కాంగ్రెస్​నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.