![ఒడిశా నుంచి ఢిల్లీకి గంజాయి రవాణా..ముఠా అరెస్ట్](https://static.v6velugu.com/uploads/2021/12/Arrest-of-gang-transporting-cannabis-from-Odisha-to-Delhi_xhoJHBblpa.jpg)
ఒడిశా నుంచి ఢిల్లీకి గంజాయి రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్ చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాథ్ బాబు తెలిపారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సిమన్ సింగ్, లబఖర,రోహిత్ పాంగి ,కృష్ణ ఖేముడు ,పాంగినరసింహరావు లను అరెస్టు చేశారు. వీరిలో ప్రధాన ముద్దాయిహేరా సింగ్ పరారీలో ఉన్నారన్నారు. 2 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఒక లారీ, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.