భద్రాచలం, వెలుగు: ఇద్దరు గంజాయి స్మగ్లర్లు ఆంధ్రాలోని సీలేరు నుంచి బైక్ పై స్పీడ్‌గా వస్తుండడంతో కూనవరం రోడ్డులో ఆబ్కారీ, ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. కానీ వారు తప్పించుకుని భద్రాచలం పట్టణంలోనికి వెళ్లారు. వారిని పోలీసులువెంబడించారు. భద్రాచలం గోదావరి వంతెన వద్ద ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్టులోని సీఆర్పీఎఫ్ జవాన్లకు సమాచారం అందించడంతో వారు బారికేడ్లు అడ్డంగా పెట్టారు.
అయినా తప్పించుకునే ప్రయత్నం చేసి బైకుతో సహా కిందపడ్డారు. దీంతో వారిని పట్టుకున్నారు. సింగరేణి మండలం ఉసిరికాయపల్లికి 8 కిలోల గంజాయిని బ్యాగులో తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సినీ ఫక్కీలో సాగిన ఈ ఛేజింగ్‌ను చూసిన జనం ఆశ్చర్యపోయారు.