మానకొండూర్, వెలుగు: మానకొండూర్ మండలంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న నిందితులను మానకొండూర్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. మండలంలోని జగ్గయ్యపల్లెకు చెందిన అనిల్ రెడ్డి, లింగాపూర్ కు చెందిన భరత్ రెడ్డి, మానకొండూరుకు చెందిన షేక్ ఇస్మాయిల్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ ఎం రాజ్ కుమార్ తెలిపారు.
వారినుంచి 1.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీళ్లను మంగళవారం సాయంత్రం మానకొండూరు చెరువు కట్టపై ఉన్న మార్కెట్ కమిటీ చెక్ పోస్ట్ వద్ద పట్టుబడ్డారన్నారు.