ఇద్దరు గల్ఫ్​ ఏజెంట్ల అరెస్ట్

జగిత్యాల రూరల్, వెలుగు: గల్ఫ్​ పంపిస్తామని మోసం చేసిన మ్యాన్ పవర్ కన్సల్టెన్సీకి చెందిన  ఇద్దరు ఏజెంట్లను అరెస్టు చేసినట్లు జగిత్యాల డీఎస్పీ వెంకటస్వామి తెలిపారు.  జిల్లా కేంద్రం లోని టౌన్ పీఎస్‌‌‌‌‌‌‌‌లో ఆయన వివరాలు వెల్లడించారు. బుగ్గారం మండలం శేకల్లకు చెందిన రాచకొండ మహేశ్‌‌‌‌‌‌‌‌, పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన వాసు మహేశ్‌‌‌‌‌‌‌‌.. జగిత్యాలలో విఘ్నేశ్వర మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేశారు. 

గల్ఫ్‌‌‌‌‌‌‌‌కు పంపిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలు ​చేశారు. వారం కింద 120 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎంక్వైరీ చేపట్టారు. ఎస్పీ భాస్కర్ ఆదేశాలతో మూడు టీంలు ఏర్పాటు చేసి నిందితులను అరెస్టు చేశారు. 

బాధితుల నుంచి రూ.2. 90 కోట్లు వసూలు చేసినట్లు తేలిందన్నారు. నిందితుల వద్ద రెండు కార్లు, మూడు తులాల బంగారం, రూ.ఐదు లక్షల విలువ చేసే ఫోన్లు, 2.50లక్షల నగదు, ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌లు, ప్రింటర్లు, ఏసీలు స్వాధీనం చేసుకున్నారు. ప్రెస్ మీట్ లో సీఐ నటేశ్, సిబ్బంది ఉన్నారు.