
పెగడపల్లి, వెలుగు: గంజాయి తరలిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. పెగడపల్లి మండలం దోమలకుంటకు చెందిన బైర కల్యాణ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రాథోడ్ అర్జున్, రాథోడ్ దేవా, జాదవ్ కిషన్ కలిసి గంజాయి అమ్మేందుకు పెగడపల్లికి వచ్చారు. బస్టాండ్‌లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఈ నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద 400 గ్రాముల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. బుధవారం నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.