యోగా ప్రచారం, ఆయుర్వేద ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే రాందేవ్ బాబాకు అరెస్ట్ వారెంట్ పంపించింది కేరళ కోర్టు. తప్పుడు ప్రకటనలతో ప్రచారం చేసి లబ్ది పొందారనే కేసులో రాందేవ్ బాబాతో పాటు ఆయన అనుచరుడు ఆచార్య బాలకృష్ణలతో పాటు పతంజలి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే దివ్య ఫార్మసీపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ప్రకటనల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించారని కేరళ డాక్టర్ 2023లో వేసిన కేసులో వీరిపై అరెస్టు వారెంటు జారీ అయ్యింది. ఆ తర్వాత 2024లో ఉత్తరాఖండ్ లో కూడా ఇదే అంశంపై కేసు నమోదైంది.
ఈ కేసులో 16 జనవరి 2025 న ఉన్న విచారణకు హాజరు కాలేక పోవడంతో వీరిపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. రాందేవ్ బాబా పై కేరళ కోర్టు అరెస్టు వారెంట్ ఇవ్వడం ఇది తొలిసారి. పతంజలి ఉత్పత్తులు వాడటం వలన డయాబెటిస్ తగ్గుతుందని ప్రచారం చేసి లబ్ది పొందిన కారణంగా Drugs and Magic Remedies (అభ్యంతరకర ప్రకటనల) చట్టం, 1954 ప్రకారం 2024 అక్టోబర్ లో పతంజలిపై కేసు నమోదైంది. జనవరి 16 వాదనలకు హాజరు కానందున అరెస్టు వారెంట్ జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను 2025 ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది.
Also Read:-టిక్ టాక్లో అమెరికా పెట్టుబడులు: తిరిగి మొదలైన సందడి..
సుప్రీం కోర్టు తీర్పుతో వేగం పెంచిన కేరళ కోర్టు:
డ్రగ్స్, ఔషదాలపై వ్యక్తులు గానీ, కంపెనీలు గానీ తప్పుడు ప్రకటనలు చేసి లబ్దిపొందాలని చూస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు 15 జనవరి 2025 తీర్పులో స్పష్టం చేసింది. జస్టిస్ అభయ్ ఓక, ఉజ్జల్ భుయాన్ తీర్పు వెలువరిస్తూ ఔషదాల, డ్రగ్స్ తో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడే ఎవరిపైనైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తీర్పు వెలువరించారు.
రాందేవ్ బాబా ప్రకటనలతో లబ్ది పొందాలనుకున్నారా?
కోవిడ్ 19 సమయంలో తమ పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులు వినియోగిస్తే కరోనా తగ్గుతుందని రాందేవ్ బాబా అప్పట్లో ప్రచారం చేశారు. దీంతో కంపెనీకి చాలా లాభాలు సమకూరాయి. అదేవిధంగా షుగర్ వ్యాధిని తగ్గించడంలో తమ ఆయుర్వేద మాత్రలు చలా బాగా పనిచేస్తాయని స్వయంగా రాందేవ్ బాబా ప్రచారం చేశారు. అయితే శాస్త్రీయంగా ప్రకటనల్లో చెప్పినట్లు పనిచేయడం కేరళకు చెందిన డాక్టర్ బాబు వేసిన కేసుతో.. కేరళ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్ మెంట్ పరీక్షలు నిర్వహించింది. 2023 నవంబర్ లో పతంజలి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆ తర్వాత డాక్టర్ బాబు ప్రధాని కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా పతంజలి కేసులో రాందేవ్ బాబాతో పాటు అతని అనుచరులపై అరెస్ట్ వారెంట్ జారీ కావడం గమనార్హం.