ఖమ్మం మిర్చి యార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 85వేల బస్తాల రాక

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సోమవారం మిర్చి పోటెత్తింది. సుమారు 85 వేల బస్తాలు రైతులు అమ్మకానికి తెచ్చినట్లు మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రేడ్​వన్​సెక్రటరీ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్​ తెలిపారు.  గ్రేడ్1 మిర్చికి జెండా పాట క్వింటాకు రూ.20,850 పలికింది. వ్యాపారులు గ్రేడ్ ను బట్టి రూ.18 వేలకు పైగా కొనుగోలు చేశారు. సోమవారం సాయంత్రం వరకు 64 వేల బస్తాలు కాంటాలై తోలకాలు జరిగినట్లు సెక్రటరీ తెలిపారు. క్వాలిటీ మిర్చికి కూడా వ్యాపారులు తక్కువ ధర ఇస్తున్నారని కొందరు రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు.