జోహనెస్ బర్గ్ వేదికగా జరుగుతోన్న భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డేలో ఆతిధ్య సౌతాఫ్రికా జట్టు సొంతగడ్డపై పేలవ బ్యాటింగ్ తో నిరాశ పరిచింది. ఇటీవలే జరిగిన మూడో టీ20లో భారత్ దెబ్బకు చేతులెత్తేసిన సఫారీలు మరోసారి చెత్త బ్యాటింగ్ తో మ్యాచ్ ను చేజార్చుకునే పరిస్థితికి తెచ్చుకున్నారు. భారత పేసర్లు అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ ధాటికి కేవలం 116 పరుగులకే ఆలౌటైంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న దక్షిణాఫ్రికా ఆనందం ఎంతోసేపు నిలవలేదు. రెండో ఓవర్లో అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీసి సఫారీల పతనానికి పునాది వేశాడు. ఇక ఆ తర్వాత కాస్త కోలుకున్నట్లు కనిపించినా.. అర్షదీప్, ఆవేశ్ ఒక్కసారిగా సఫారీలను కుప్పకూల్చారు. వీరి ధాటికి 42/2 తో దక్షిణాఫ్రికా 73/8 గా నిలిచింది. ఈ దశలో సఫారీ ఆల్ రౌండర్ ఫహుల్క్ వాయో కొన్ని మెరుపులతో ఆతిధ్య జట్టును 100 పరుగులు దాటించాడు. ఈ భాగస్వామ్యాన్ని అర్షదీప్ విడదీయడంతో కేవలం 117 పరుగుల టార్గెట్ భారత్ ముందు ఉంచింది.
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ కు 5 వికెట్లు, అవేశ్ ఖాన్ 4 వికెట్లు తీసుకున్నారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు ఒక వికెట్ లభించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఫహుల్క్ వాయో 33 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ జార్జ్ 28, షంసి 11, మార్కరం 12 పరుగులు చేశారు. మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.
IND vs SA 1st ODI: Arshdeep Singh's maiden five-wicket haul helps India bowl out South Africa for 116 in 27.3 overs. Avesh Khan picks four wickets.
— माधुरी शुक्ला (@MadhuriShukla2) December 17, 2023
(Source: BCCI)#ArshdeepSingh #AveshKhan #1stODI #INDvsSA #RohitSharma #AUSvPAK #KLRahul pic.twitter.com/wM5QHmL6LR