దుబాయ్: టీమిండియా లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 2024 ఏడాదికిగాను ‘ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందుకున్నాడు. అలాగే, ‘మెన్స్ టీ20 ఆల్‌స్టార్ ఎలెవన్ టీమ్’కూ ఎంపికయ్యాడు. గతేడాది 18 మ్యాచ్‌ల్లో 15.31 యావరేజ్, 7.49 ఎకానమీతో 36 వికెట్లు తీసిన అర్ష్‌దీప్.. ఇండియా టీ20 వరల్డ్‌కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మెగా టోర్నీలో పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్ ఎనిమిది మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టాడు.
సికందర్ రజా (జింబాబ్వే), ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా), బాబర్ ఆజమ్ (పాకిస్తాన్)తో పోటీపడి అర్ష్‌దీప్ ఈ అవార్డును దక్కించుకోవడం విశేషం. మరోవైపు ఐసీసీ ప్రకటించిన టీ20 ఆల్‌స్టార్ ఎలెవన్ టీమ్‌కు రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇందులో బుమ్రా, అర్ష్‌దీప్, హార్దిక్ పాండ్యాకు చోటు దక్కింది. గతేడాది రోహిత్ 11 మ్యాచ్‌ల్లో 378 రన్స్ చేశాడు. ఆల్‌రౌండర్‌గా పాండ్యా 17 మ్యాచ్‌ల్లో 352 రన్స్, 17 వికెట్లు తీశాడు. ఐసీసీ మెన్స్ ఆల్‌రౌండర్స్ లిస్ట్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్నాడు. బుమ్రా 8 మ్యాచ్‌ల్లో 8.26 యావరేజ్‌తో 15 వికెట్లు పడగొట్టాడు.