Vijay Hazare Trophy: గైక్వాడ్‌కు దిమ్మతిరిగే డెలివరీ.. ఛాంపియన్స్ ట్రోఫీ రేస్‌లో అర్షదీప్

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో అదరగొడుతున్నాడు. శనివారం (జనవరి 10) పుణెతో జరుగుతున్న మ్యాచ్ లో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు తీసుకొని రాణించాడు. ఇందులో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా ఈ పంజాబీ పేసర్ వేసిన మొదటి స్పెల్ అద్భుతమని చెప్పుకోవాలి.  వడోదర వేదికగా జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో పూణే మొదట బ్యాటింగ్ చేస్తుంది. 

కొత్త బంతితో అర్షదీప్ ప్రారంభంలో పూణే ఆటగాళ్లను ఇబ్బంది పెట్టాడు. తన స్వింగ్ తో ఉక్కిరిబిక్కిరి చేశాడు. ముఖ్యంగా టీమిండియా యువ ఆటగాడు.. పూణే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ను అద్భుతమైన ఔట్ స్వింగ్ తో ఔట్ చేశాడు. గైక్వాడ్ తో పాటు సిద్ధేష్ వీర్ ను డకౌట్ చేశాడు. అర్షదీప్ తన బౌలింగ్ తో ఛాంపియన్స్ ట్రోఫీ రేస్ లో నిలిచాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే అర్షదీప్ రాణించినా మిగిలిన బౌలర్లు విఫలం కావడంతో పూణే 275 పరుగుల స్కోర్ చేసింది. 

ALSO READ | SA20: మ్యాచ్ ఫిక్సింగ్‌పై అనుమానాలు.. ప్రిటోరియా షాకింగ్ ఓటమి

ఈ నెల 12 తర్వాత అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇంగ్లాండ్ సిరీస్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ఎంపిక చేయనున్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరీస్ ఎంపికవ్వడం ఖాయం. వీరికి బ్యాకప్ గా ప్రసిద్ కృష్ణ రూపంలో అర్షదీప్ కు గట్టి పోటీ ఎదురు కానుంది. లెఫ్టర్మ్ పేసర్ కావడంతో ఈ పంజాబీ పేసర్ ను సెలక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత్ తరపున ఇప్పటివరకు అర్షదీప్ సింగ్ 8 వన్డేలు.. 60 టీ20 మ్యాచ్ లు ఆడాడు. టీ20 రెగ్యులర్ ప్లేయర్ గా కొనసాగుతున్న అర్షదీప్ వన్డేల్లో చోటు కోసం పోరాడుతున్నాడు.