T20 World Cup 2024: అర్షదీప్ విజృంభణ.. భారత్ ముందు స్వల్ప లక్ష్యం

T20 World Cup 2024: అర్షదీప్ విజృంభణ.. భారత్ ముందు స్వల్ప లక్ష్యం

న్యూయార్క్ వికెట్ పై మరోసారి భారత బౌలర్లు చెలరేగారు. బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై అమెరికా బ్యాటర్ల భరతం పట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులకు పరిమితమైంది. ఈ పిచ్ పై భారత బౌలర్లను ఎదుర్కొని ఈ మాత్రం స్కోర్ చేసిందంటే పర్వాలేదని చెప్పుకోవాలి. నితీష్ కుమార్ 27 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

స్టీపెన్ టేలర్, నితీష్ కుమార్ రాణించినా..  
 
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన అమెరికా జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. ఆ జట్టుకు అర్షదీప్ సింగ్ తొలి ఓవర్ లోనే బిగ్ షాక్ ఇచ్చాడు. జహంగీర్ ను తొలి బంతికి ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుట్ చేశాడు. ఇదే ఓవర్ చివరి బంతికి గౌస్ ను వెనక్కి పంపి అమెరికాను కష్టాల్లోకి నెట్టాడు. ఈ దశలో స్టీపెన్ టేలర్(24), నితీష్ కుమార్(27) ఆదుకున్నారు. ముఖ్యంగా నితీష్ కుమార్ వేగంగా పరుగులు రాబట్టాడు. 

వీరిద్దరూ ఔటైన తర్వాత అమెరికా పరుగుల వేగం మందగించింది. వచ్చిన వారు ఓ మోస్తరు స్కోర్ కే పరిమితమయ్యారు. దీంతో అమెరికా 
110 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 4 వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యకు 2 వికెట్లు దక్కాయి. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నాడు.