IPL Retention 2025: ఇకపై మీరెవరో.. నేనెవరో.. : ప్రీతి జింటాకు షాకిచ్చిన భారత పేసర్

IPL Retention 2025: ఇకపై మీరెవరో.. నేనెవరో.. : ప్రీతి జింటాకు షాకిచ్చిన భారత పేసర్

పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు  కేవలం ఇద్దరు ఆటగాళ్లనే పంజాబ్ రిటైన్ చేసుకుంది. యంగ్ బ్యాటర్స్ ప్రభుమాన్ సింగ్, శశాంక్ సింగ్‎లను మాత్రమే వచ్చే సీజన్ కోసం జట్టుతో అట్టిపెట్టుకుని మిగిలిన అందరిని వేలానికి వదిలేసింది. ఆన్ క్యాప్డ్ ప్లేయర్స్ ప్రభుమాన్ సింగ్‎కు రూ.4 కోట్లు, శశాంక్ సింగ్‎కు రూ.5.4 కోట్లు చెల్లించి పంజాబ్ రిటైన్ చేసుకుంది. తమ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను విడుదల చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటారనుకుంటే బిగ్ షాక్ ఇచ్చింది. 

అర్ష్‌దీప్ సింగ్‌ సోషల్ మీడియా వేదికగా తన నిరాశను వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో పంజాబ్ కింగ్స్ కు సంబంధించి అన్ని పోస్ట్‌లు, ఫోటోలను డిలీట్ చేశాడు. దీంతో రాబోయే సీజన్ లో పంజాబ్ అతన్ని తీసుకోనట్టు స్పష్టంగా అర్ధమవుతుంది. తాజా పరిణామంతో రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా తీసుకునే అవకాశాలు లేనట్టే. వస్తున్న సమాచార ప్రకారం పంజాబ్ రూ. 18 కోట్ల రూపాయలు పెట్టి ఆర్షదీప్ సింగ్ ను తీసుకోవడానికి ఆసక్తి చూపించలేదట. ఈ కారణంగానే అతన్ని మెగా ఆక్షన్ లోకి వదిలేసినట్టు నివేదికలు చెబుతున్నాయి. 

Also Read : ఇప్పుడున్న భారత జట్టును పాకిస్థాన్ ఓడించగలదు

2019 లో పంజాబ్ జట్టులో చేరిన అర్షదీప్ సింగ్ ఆ జట్టుకు మూల స్థంభంలా నిలిచాడు. పంజాబ్ తరపున 65 మ్యాచ్ ల్లో 76 వికెట్లు తీసి అత్యంత నిలకడగా రాణించాడు. ఈ ప్రదర్శనతో భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించాడు. ఇటీవలే జరిగిన టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో అర్షదీప్ సింగ్ సభ్యుడు. అర్షదీప్ సింగ్ తో పాటు హర్షల్ పటేల్, సామ్ కర్రాన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి స్టార్ ప్లేయర్లను పంజాబ్ కింగ్స్ వదిలేసుకుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలై 16 సీజన్లు గడిచినప్పటికీ ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ ఒక్కసారి ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. కేవలం ఒక్కసారి మాత్రమే ఫైనల్ వరకు చేరుకుంది. ఈ ఫర్మామెన్స్ మినహా ఇస్తే... ప్రతి సీజన్‎లోనూ చెత్త ప్రదర్శనతో టైటిల్ గెలవకుండానే పంజాబ్ కింగ్స్ వెనదిరిగింది.దీంతో వచ్చే సీజన్‎లో ఎలాగైనా టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న పంజాబ్ జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయ్యింది. ఏకంగా రూ.110.5 కోట్లతో పంజాబ్ మెగా వేలంలో పాల్గొననుంది.