Chandigarh T20: టీ20 లీగ్‌లో విధ్వంసం.. ఒకే ఓవర్లో 38 పరుగులు

Chandigarh T20: టీ20 లీగ్‌లో విధ్వంసం.. ఒకే ఓవర్లో 38 పరుగులు

టీ20 క్రికెట్ అంటే బౌండరీల వర్షం. ఒక ఓవర్లో 20, 25 పరుగులు చేస్తే ఔరా అంటాం. 30 పరుగులు కొడితే విధ్వంసం అంటాం. అదే ఒకే ఓవర్ లో 36 పరుగులు కొడితే అద్భుతం అంటారు. ఓవర్ లో 36 పరుగులు కంటే ఎక్కువ రావడం సాధ్యం కాదు. కానీ ఇండియాలో జరుగుతున్న చండీగఢ్ టీ20లో అత్యద్భుతం చోటు చేసుకుంది. ఒకే ఓవర్ లో ఏకంగా 38 పరుగులు వచ్చాయి. అర్స్లాన్ ఖాన్ విధ్వంసానికి అదృష్టం కూడా కలిసి వచ్చింది. 

ALSO READ | IND vs ENG: సిరీస్ మనదే: కటక్‌లో ఇంగ్లాండ్ చిత్తు.. రోహిత్ సెంచరీతో టీమిండియా ఘన విజయం

హార్దిక్ చౌదరి వేసిన బౌలింగ్ లో విజృంభించి 35 పరుగులు కొట్టాడు. వీటిలో  3 నో బాల్స్ ఉండడంతో మొత్తం 38 పరుగులు వచ్చాయి. తొలి బంతికి సిక్సర్ కొట్టగా.. రెండో బంతికి పరులేమీ రాలేదు. మూడో బంతికి సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత రెండు నో బాల్స్ లో వరుసగా 4, 2 పరుగులు చేశాడు. ఫ్రీ హిట్ లో ఫోర్ బాదడంతో తొలి నాలుగు బంతులకే 24 పరుగులు వచ్చాయి. చివరి రెండు బంతులను సిక్సర్ గా మలిచాడు. అయితే చివరి బంతికి నో బాల్ కావడంతో ఆ బంతికి సింగిల్ వచ్చింది. ఈ ఓవర్ లో హార్దిక్ చౌదరి 9 బంతులు వేయడం విశేషం.