నేషనల్ అవార్డ్ ఆర్ట్‌ డైరెక్టర్‌ సూసైడ్?

సినిమా ఇండస్ట్రీ నుంచి ఎప్పుడు..ఎటువంటి  వార్తా సంచలనంగా మారుతుందో తెలియదు. లేటెస్ట్ గా బాలీవుడ్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ నితిన్‌ చంద్రాకాంత్‌ దేశాయ్‌ (Nitin Chandrakanth Desai) అనుమానాస్పద స్థితిలో చనిపోయిన విషయం తెలిసిందే. నితిన్ దేశాయ్ తన ఆర్ట్‌ స్టూడియోలోనే చనిపోవడం  బాలీవుడ్ ఇండస్ట్రీ ని విషాదంలో ముంచింది.  ఆత్మహత్య చేసుకుని చనిపోయారు అంటూ వస్తోన్న న్యూస్..ఇప్పుడు  సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

నితిన్ దేశాయ్ నేషనల్ వైడ్ గా ఎంతో గుర్తింపు పొందిన ఆర్ట్ డైరెక్టర్స్ లో ఒకరు. అయన వర్క్ చేసిన లగాన్, జోదా అక్బర్‌ లాంటి అద్భుతమైన పీరియాడిక్‌, ఛారిత్రాత్మక మూవీస్ కు అద్భుతమైన ఆర్ట్‌ వర్క్ ను అందించి.. 4 టైమ్స్ నేషనల్ అవార్డ్స్ సాధించారు. యాక్టర్ ,డైరెక్టర్, ప్రొడ్యూసర్,ఆర్ట్ డైరెక్టర్ గా బాలీవుడ్ లో ఎంతో ఫేమస్ అయినా నితిన్ దేశాయ్..సూసైడ్ చేసుకుని చనిపోవడం అనేది ఇండస్ట్రీ నమ్మలేకపొతున్నారు.  దీంతో అన్ని విధాలుగా ఇన్వెస్టిగేషన్ చేసి..మరణానికి గల కారణాలు తెలుసుకోవాలని నెటిజన్స్ నుంచి కామెంట్స్ వినిపిస్తోన్నాయి. 

నితిన్ దేశాయ్ పలు ఫైనాన్స్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో అప్పు తీసుకుని.. తిరిగి కట్టలేక సూసైడ్  చేసుకున్నారని హల్ చల్ అవుతోంది. తన ఆర్ట్‌ స్టూడియో నుంచి ఆడియో రికార్డింగ్ ఒకటి లభించింది. పోలీసులుకు ఆడియో రికార్డింగ్ ను ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఫోరెన్సిక్ నిపుణుల నుంచి దానిని విశ్లేషించడం పూర్తీ చేశాక వివరాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.