నుమాయిష్​లో ఆర్ట్ ఎగ్జిబిషన్​ షురూ

బషీర్ బాగ్, వెలుగు: కళాకారులు తమ ఆర్ట్​ల ద్వారా సమాజానికి సందేశం ఇవ్వడం అభినందనీయమని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు.  నుమాయిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్యాలరీలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. 84 ఏళ్లుగా నుమాయిష్ లో ఆర్ట్ ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్నట్లు సొసైటీ అధ్యక్షుడు రమణారెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా 250 మంది చిత్ర కళాకారుల పెయింటింగ్స్ ఇందులో ప్రదర్శకు ఉంచామన్నారు.

ఉత్తమ పెయింటింగ్స్​కు గోల్డ్, సిల్వర్ ,  బ్రాంజ్​మెడల్స్ తో పాటు నగదు పురస్కారాన్ని అందిస్తామన్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సొసైటీ కన్వీనర్ సామల వేణు మాట్లాడుతూ... ఫిబ్రవరి 2న 8 నుంచి12 సంవత్సరాల పిల్లలకు ట్రాఫిక్ నియమాలపై, 13 నుంచి 16 ఏండ్ల పిల్లలకు డ్రగ్స్ నివారణపై పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నామని, తల్లిదండ్రులు వారి పిల్లల పేర్లను నుమాయిష్ కు వచ్చి నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి సురేందర్ రెడ్డి, ట్రెజరర్ ప్రభ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే యశోదా హాస్పిటల్​సహకారంతో నుమాయిష్ లో ఏర్పాటు చేసిన హెల్త్ చెకప్ సెంటర్ ను మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. నిర్వాహకులు డాక్టర్ ఎన్.సంజీవ్ కుమార్, డాక్టర్ జీఎస్ శ్రీనివాస్ , డాక్టర్ ఎస్.రాజేందర్, ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి సురేందర్, ఉపాధ్యక్షుడు నిరంజన్ పాల్గొన్నారు.