అసలేందీ ఆర్టికల్ 15.?

ఒక పాపులర్ యాక్టర్. ఒక సీనియర్ డైరెక్టర్. ఇద్దరూ కలిసి ఓ సినిమా ప్లాన్ చేశారు.ఆ సినిమా ప్రారంభించినప్పుడు వాళ్లకి తెలియదు… అదో సెన్సేషన్ అవుతుందని.వివాదాలు సృష్టిస్టుందని. కోర్టు వరకూ తీసుకెళ్తుందని. అయినా కూడా విజయం సాధించి వారం తిరిగేసరికల్లా యాభై కోట్ల పైన వసూలు చేస్తుందని.ఆ నటుడు… ఆయుష్మాన్ ఖురానా. ఆ దర్శకుడు… అనుభవ్ సిన్హా.ఆ సినిమా… ఆర్టికల్ 15.

          ప్రజాస్వామ్యం, సమానత్వం అంటూ పదే పదే చెప్పుకునే దేశంలో… ప్రజలను విభజించి… పైవాడు, కిందవాడు.. అధికుడు, అంటరానివాడు అంటూ వేరు చేసి మాట్లాడే మాటలు ఎవరికీ వినిపించవా? కేవలం తక్కువ కులంలో పుట్టారన్న కారణంతో వారి పట్ల ఎలాగైనా ప్రవర్తించవచ్చు, వారిని ఏమైనా చేయొచ్చు అని భావించే కొందరు చేసే దారుణాలు ఎవరి కంటికీ కనిపించవా? ఇదే ప్రశ్నించింది ‘ఆర్టికల్ 15’ సినిమా.

ఇదీ కథ

తన తండ్రి కోరిక మేరకు ఐపీఎస్‌‌ ఆఫీసర్ అవుతాడు అయాన్ రంజన్. యూపీలోని ఓ ప్రాంతానికి డ్యూటీ మీద వస్తాడు. అతడికి తగిలే మొదటి కేస్… ముగ్గురమ్మాయిల అదృశ్యం. అందులో ఇద్దరు ఓ రోజు ఉదయం చెట్టుకు ఉరి వేసుకుని వేళ్లాడుతూ కనిపిస్తారు. ఒకమ్మాయి జాడ తెలియదు. దాంతో ఈ కేసును పరిష్కరించే బాధ్యత తీసుకుంటాడు ఆఫీసర్. ఆ క్రమంలో అతడికి అసలు సమస్య అర్థమవుతుంది. దళిత గ్రామాలు ఎక్కువగా ఉన్న ఆ ప్రాంతంలో కొందరు అధిక కులస్తుల దురాగతాలు సాగుతూ ఉంటాయి. కేవలం మూడు రూపాయల కూలి అడిగినందుకు, ఇవ్వనంటే తిరగబడినందుకు ఆ ముగ్గురమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తారు. రెండు మూడు రోజుల పాటు దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి ఇద్దర్ని చంపేస్తారు. ఓ చెట్టుకు ఉరివేసి వేలాడదీస్తారు. ఆ అమ్మాయిల ప్రవర్తన మంచిది కాదని, అది తెలిసి వాళ్ల తండ్రులే చంపేశారని సృష్టిస్తారు. మూడో అమ్మాయిని కనబడకుండా చేస్తారు. ఈ మొత్తం క్రైమ్‌‌లో కొందరు పోలీసులు కూడా ఉన్నారని అయాన్‌‌కి అర్థమవుతుంది. వాళ్లందరినీ ఎదిరించి కేసును ఎలా ఛేదించాడు, రాజకీయ ఒత్తిళ్లను ఎలా ఎదుర్కొన్నాడు, తన ఉద్యోగ పరిధిని సైతం దాటి ఎలా ముందుకు సాగాడు, ఆ అమ్మాయిని ప్రాణాలతో పట్టుకోగలిగాడా, అక్కడి వివక్షను రూపుమాపగలిగాడా అన్నది మిగతా కథ.

2014లో యూపీలోని బదావూలో ఓ సంఘటన జరిగింది. ఇద్దరు దళిత అమ్మాయిల్ని రేప్ చేసి చంపేసి, చెట్టుకు ఉరి వేశారు. ఆ స్ఫూర్తితో తీసిన సినిమానే ఇది. స్థానికంగా ఉన్న కొందరు పెద్దలతో పాటు ఇద్దరు పోలీసులు కూడా ఆ కేసులో నిందితులు. వారిని కాపాడటానికి రాజకీయ శక్తులు చాలా ప్రయత్నించాయి. ఆ అమ్మాయిలపైనే బురద చల్లి కేసును పక్కదోవ పట్టించాయి. ఆ రోజు ఆ అమ్మాయిలు చెట్టుకు వేళ్లాడుతున్న ఫొటో… డైరెక్టర్ అనుభవ్ మనసులో ముద్ర పడిపోయింది. దాన్నుంచే ఈ కథ పుట్టింది. పుడితే పుట్టింది, బ్రాహ్మణుల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటనేది ఆ సంఘాల వాదన. ఎవరినీ టార్గెట్ చేసే ఉద్దేశం లేదు, వాస్తవాల్ని చూపించానంతే అన్నది దర్శకుడి జవాబు. అనుభవ్ ఎంతో అనుభవమున్న డైరెక్టర్‌‌‌‌. నిజాన్ని నిర్భయంగా చెప్పడం అతని నేచర్. అంతకంటే ఎలా స్పందిస్తాడు!

రైట్‌‌ టు ఈక్వాలిటీ… సమానత్వ హక్కు. అది మనకి ఉందనే మనం అనుకుంటున్నాం. ఎందుకంటే స్త్రీకి పురుషులతో సమానంగా విద్య, ఉద్యోగావకాశాలు లభించాలని, పదవులు లభించాలని పోరాడేంత నాగరికులమయ్యాం కాబట్టి. కానీ అసలు మనిషిని మనిషిలానే చూడని సంస్కృతి ఇప్పటికీ మన దేశంలో ఉందని, వివక్షకి చాలామంది అమాయకులు బలవుతున్నారని చాలామందికి తెలియదు. దళితులంటూ వేరు చేసి, వారి నీడ పడినా మలినమైపోతామంటూ కొందరిని ఈ సమాజంలో పక్కన పెట్టేస్తున్నారన్న సంగతి పట్టించుకునే తీరిక మనకి లేదు. దాన్ని గుర్తు చేసేందుకే ఈ సినిమా తీశానంటున్నాడు అనుభవ్ సిన్హా. ఆయుష్మాన్‌‌ లాంటి అద్భుతమైన హీరో దొరకడంతో ఆయన ఆలోచన చాలా అందంగా రూపుదిద్దుకుంది. కాసులు మూటగట్టుకుంటోంది.  ప్రశంసలూ అందుకుంటోంది. వాటితో పాటే విమర్శలు కూడా!

వివక్షే వివాదం
రాజ్యాం గంలోని ‘ఆర్టికల్ 15’లో ఏముం ది? బహుశా ఈ ప్రశ్నకి సమాధానం అందరూ చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే వారికి దాని గురించి తెలిసి ఉండకపోవచ్చు. తెలుసుకోవాల్సిన అవసరం రాకపోయి ఉండొచ్చు. అందుకే దాన్నితెలిసేలా చేయడమే తన మొదటి లక్ష్యంగా పెట్టుకున్నాడు అనుభవ్ సిన్హా .మత, కుల, జాతి, లింగ, స్థల వివక్ష కూడదని చెప్పింది మన రాజ్యాం గంలోని పదిహేనో ఆర్టికల్. అదే ఈ సినిమాకి ముడిసరుకు. గతంలో ‘ముల్క్’ తీసినప్పు డు టెర్రరిజం కొందరు అమాయకుల్ని ఎలా బలి తీసుకుం టోందో చూపించిన అనుభవ్… ఇప్పుడు వివక్ష కొందరి జీవితాలను ఎలా అల్లకల్లోలం చేస్తోందో కళ్లకు కట్టాడు. నిజం నిప్పులాంటిది, కాల్చేస్తుందని అతనికి తెలియక కాదు. కాల్చినా ఫర్వాలేదు, నిజం తెలిసి తీరాలనుకున్నాడంతే. అందుకే ధైర్యంగా వివక్ష అన్న పదాన్ని నొక్కి చెప్పాడు. బ్రాహ్మణుల చేతిలో దళితులు అన్యాయానికి గురవుతున్నారన్న విషయాన్ని ఎత్తి చూపిం చి వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు. తమ కమ్యూనిటీ గురిం చి తప్పుగా చూపిం చడం తట్టు కోలేని కొన్నిబ్రాహ్మణ సంఘాలు సినిమాని నిషేధిం చమంటూ కోర్టుకెక్కా యి. కానీ అక్కడ వారికి చుక్కెదురైంది. దాంతో సినిమా తిరుగులేకుండా రన్‌‌ అవుతోంది. కొన్నిప్రాంతాల్లో ఇప్పటికీ షోలను అడ్డుకుంటున్నా… మిగతా ప్రాంతాల్లో మాత్రం విజయవంతంగా ఆడుతోంది. ఎందుకంటే మంచి సినిమా… ఎప్పుడూ మంచి సినిమాయే కాబట్టి. మంచి ఫలితాన్నే ఇస్తుంది కాబట్టి.